రైలు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్లీపర్ క్లాస్‌లో వెళ్లితే ప్రశాంతత మాట దేవుడెరుగు..ఒకటే గజిబిజి గందరగోళంలా ఉంటుంది వాతావరణం. ఏదో ఫోన్‌లో తలదూర్చి లేదా పేపర్‌తోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు దిగిపోతాం రా బాబు అనుకుంటుంటాం. అలాంటి విసుగు, ఇబ్బంది కలగకుండా హాయిగా ట్రైన్ జర్నీ సాగిపోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పే జర్నీ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఆమె తన రైలు ప్రయాణాన్ని వీడియో తీసి మరీ నెట్టింట్ షేర్ చేశారు.
ఆ వీడియోలో మలైకా మీరు బుక్ చేసుకున్న క్లాస్‌ని బట్టి జర్నీ ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. "తక్కవ బడ్జెట్‌లో వెళ్లాలనుకుంటే స్లీపర్, సెకండ్ క్లాస్‌లు అనువైనవి. అలాకాకుండా తన వ్యక్తిగత గోప్యత కోరుకునే ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లు అనుకూలం. రైల్లో ఎక్కువసేపు ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగి పిల్లో, దుప్పటిని తప్పనిసరిగా తీసుకెళ్లడం ఉత్తమం.
ఇది ఇంటిలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే తినుబండరాలను కూడా తీసుకువెళ్లండి. అలాగే రాత్రి సమయాల్లో నిద్రపట్టనప్పుడు కాలక్షేపమయ్యేలా మంచి పుస్తకాలను, లేదా మ్యూజిక్, సినిమా చూసేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో ట్రైన్ జర్నీని హాయిగా ఎంజాయ చేస్తే సరి." అని మలైకా వీడియోలో వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.
(చదవండి: చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి..!)
Comments
Please login to add a commentAdd a comment