
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్‌కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.
మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్‌ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్‌ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్‌ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్‌లు ఈ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణ.
మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్‌లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్‌గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం.