కొడుకుని కాపాడాలని అంబులెన్స్‌తో వెళ్తే..శవాగారంలో ఉన్న కొడుకుని చూసి ఆ తండ్రి..

West Bengal Man Travels To Odisha On Ambulance To Save Son Finds Him Alive In Morgue - Sakshi

ఒడిస్సా బాలాసోర్‌లో వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. కొందరూ మాత్రం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయులై ప్రాణలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అంతటి భయానక విషాదంలోని తన వాళ్లు బతికే ఉండాలన్న ఆరాటం, ఆశతో గాలించిన కొందరి ఆశలు, ప్రయత్నాలు సఫలమయ్యాయి. వారి ప్రేమ, తపనే ఆయా వ్యక్తులకు ఊపిరి పోసి మృత్యుజయులుగా తిరిగొచ్చేలా చేసిందా!.. అన్నట్లుగా జరిగిందో ఓ ఉదంతం. ఆ తండ్రి నమ్మకమే విధే చిన్నబోయేలా గెలచింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోగలిగే చేసింది ఆ తండ్రి ఆశ.

అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్‌లోన హౌరాకు చెందిన హేలరామ్‌ అనే దుకాణదారుడు తన 24 ఏళ్ల కొడుకు బిస్వజిత్‌ మాలిక్‌ని కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించేందుకు శుక్రవారం షాలిమార్‌ స్టేష్‌న్‌కు వచ్చాడు. కొడుకుని కోరమండల్‌ రైలు ఎక్కించి వీడ్కోలు పలికి వెనుదిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రైలు ప్రమాదం గురించి విని షాక్‌ అయ్యాడు. వెంటనే కొడుకుకి ఫోన్‌ చేస్తే తాను చాలా గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హేలరామ్‌ ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ పలాష్‌ పండిట్‌ను ఏర్పాటు చేసుకుని.. తన బావ దీపక్‌ దాస్‌తో కలిసి ఒడిశాకు బయలుదేరాడు.

సుమారు 230 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రికల్లా చేరుకున్నారు. ఆ రాత్రే ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్న ప్రతి ఆస్పత్రిని సందర్శించిన ఏం ప్రయోజనం లేకపోయింది ఆ తండ్రికి . కొడుకు ఎక్కడ ఉన్నాడన్నది కానరాలేదు. అయితే అధికారులు హేలారామ్‌ని మృతదేహాలను ఉంచిన తాత్కాలిక మార్చరీ(బహనాగా హైస్కూల్‌) వద్దకు వెళ్లమని సూచించారు. నిజానికి సాధారణ పౌరులు ఎవర్నీ అక్కడకు వెళ్లనివ్వడం లేదు. బాధితుల బంధువులకు మాత్రమే అనుమతి. సరిగ్గా అక్కడకు హేలారామ్‌ చేరుకునేసరికి..ఇంతలో ఆ శవాల మధ్యలోంచి ఓ చేయి కదలడం ప్రారంభించింది. దీంతో అక్కడి వాతావరణం కాస్త గందరగోళంగా మారిపోయింది.

అదృష్టవశాత్తు ఆ చేయి కదిలిన వ్యక్తే హేలరామ్‌ కొడుకు బిస్వజిత్‌గా తేలింది. ప్రమాదం జరిగిన రెండో రోజుకి తన కొడుకు ఆచూకిని కనిపెట్టగలిగాడు హేలారామ్‌. దీంతో ఆ తండ్రి తాను తీసుకొచ్చిన అంబులెన్స్‌లో బాలాసోర్‌ ఆస్పత్రికి కొడుకుని తీసుకుకెళ్లగా.. వారు కొన్ని ఇంజెక్షన్‌లు ఇచ్చి.. కటక్‌ మెడికల్‌ కాలేజికి తీసుకెళ్లమని రిఫర్‌ చేశారు. హుటాహుటినా అతడిని ఆ అంబులెన్స్‌లోనే కోల్‌కతాలోని సదరు ఆస్పత్రికి తరలించారు.

అతని కాలికి అయ్యిన గాయాలకు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని గాయాలతో బాధపడుతున్నట్లు అతడి తండ్రి చెప్పుకొచ్చాడు. నాన్‌ మెడికల్‌ సహయక బృందం అతను అపాస్మారక స్థితిలో ఉండటంతో.. చనిపోయాడని తప్పుగా భావించి శవాలు ఉండే చోటే పెట్టినట్లు అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు హేలరామ్‌. ఎలాగైతే తన కొడుకు ప్రాణాలతో ఉంటాడన్న ఆ తండ్రి ఏకంగా అంబులెన్స్‌ మాట్లుడుకుని తీసుకెళ్లాడు. రెండు రోజులు శవాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడి కొడుకుని.. ఆ తండ్రి నమ్మకమే ఊపిరి పోసి మృత్యుంజయుడై తిరిగొచ్చేలా చేసింది.

(చదవండి: లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top