ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’ | The Prompt War Rise Of Mahaveer AI Movie Details | Sakshi
Sakshi News home page

ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’

Oct 20 2026 5:45 PM | Updated on Oct 20 2026 6:00 PM

The Prompt War Rise Of Mahaveer AI Movie Details

భారతీయ పురాణాలు, అంతుచిక్కని రహస్యాలు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కలయికతో సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు 'ఆర్విహా క్రియేషన్స్' సిద్ధమవుతోంది. ఈ సంస్థ తన తొలి చిత్రంగా ‘ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్’ని 2026 దసరా పండుగ సందర్భంగా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కథా ప్రపంచంతో ఈ సినిమా రూపొందుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భారతీయ పురాణాల్లోని అంశాలకు ఆధునిక సాంకేతికత మేళవిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నరేష్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ప్రసన్న కొత్వాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement