టాలీవుడ్ మోస్ట్ అవైటేడ్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సందీప్. ఇదిలా ఉండగానే హీరోయిన్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి వ్యాఖ్యలతో మళ్లీ వివాదం మొదలైంది. మొదట హీరోయిన్ దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఈ మూవీకి భారీగా రెమ్యునరేషన్ అడిగారని.. అంతేకాకుండా పదిశాతం వాటా అడిగారంటూ ప్రణయ్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్‌లో చర్చకు దారితీసింది.
కొత్త ట్విస్ట్..
అయితే ఈ వివాదంలో తాజాగా ఓ ట్విస్ట్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీపికా కేవలం ఒక్కసారి మాత్రమే సందీప్ వంగాను కలిశారని ఓ కథనంలో వెల్లడైంది. అదే సమయంలో స్పిరిట్ కథ కూడా ఆమెకు పూర్తిగా చెప్పలేదని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె భాగం కావాలని అనుకోలేదని నివేదికలో తెలిపింది. పూర్తి కథనం వినకుండా దీపిక ఎప్పుడూ ప్రాజెక్ట్‌కి కమిట్ అవ్వదని తెలుస్తోంది. అందుకే ఈ మూవీని దీపికా సీరియస్‌గా తీసుకోలేదని కూడా సమాచారం. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో కలిసి పని చేసేందుకు ఆమె ఆసక్తి లేదనే విషయాన్ని కూడా నివేదిక హైలెట్ చేసింది.


