ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అలాంటి కంటెంట్ సినిమాలు ఏ భాషలో తెరకెక్కించినా తెగ చూసేస్తున్నారు. అలాంటి వారికోసమే మరో భయానక హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది.
హాలీవుడ్‌లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ మూవీ బ్యూరీ ది డెవిల్. ఆదం ఓబ్రియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తమిళం, తెలుగు, హిందీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా కథ నర్స్ జూలియా పాత్ర చుట్టు తిరుగుతుంది. ఒక పాత ఇంట్లో జరిగే ఈ కథ ఆడియన్స్‌ను ఒళ్లు గగుర్పొడ్చేలా చేస్తుంది. హారర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు ఎంచక్కా ఈ మూవీని చూసేయండి.
#BuryTheDevil (English)
Now streaming on PrimeVideo in English, Tamil, Telugu, Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/ZrFm0qm6CW— OTT Trackers (@OTT_Trackers) August 22, 2026


