రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్ | Ravi Teja Irumudi Movie Creates New Overseas Box Office Record After Two Days Of Release | Sakshi
Sakshi News home page

Irumudi Collections: రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్

Aug 23 2026 9:01 AM | Updated on Aug 23 2026 11:02 AM

Raviteja Irumudi Movie Creates Record at Boxoffice in Just Two days

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్‌ వసూళ్లు సాధించింది.

తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం రిలీజైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీగా నిలిచింది. విడుదలైన రెండు రోజుల్లోనే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటివరకు ఓవర్సీస్‌లో రవితేజకు ఉన్న రికార్డును ఇరుముడి బ్రేక్ చేసింది. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టడంతో రాబోయే రోజుల్లో ఇరుముడి మరిన్ని రికార్డులు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.

కాగా.. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement