'రవితేజను ఓ బూతు మాట అనాలి.. నా వల్ల కాలేదు' | Comedian Komaram Shares Experience In Ravi Teja's Irumudi Movie | Sakshi
Sakshi News home page

Irumudi Movie: 'నా లైఫ్‌లో రవితేజను చూడలే.. అలాంటిది గళ్ల పట్టుకొమన్నాడు'

Aug 26 2026 3:37 PM | Updated on Aug 26 2026 3:44 PM

Comedian Komaram Shares Experience In Ravi Teja's Irumudi Movie

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప భక్తి తోడు కావడంతో థియేటర్ల వద్ద ఇరుముడి అదరగొడుతోంది.

ఈ మూవీతో ఫేమస్‌ అయిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్ కొమురం ఒకరు. ఈ సినిమాలో ఏకంగా విలన్ పాత్రలో మెప్పించారు. ఒక్కసారిగా స్టార్‌ హీరో చిత్రంలో విలన్‌ రోల్ చేయడం నా కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేనని కొమురం అన్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కొమురం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమురం ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పెద్ద బ్యానర్‌లో నన్ను ఎలా తీసుకున్నారని మొదట నాకే అనుమానం వచ్చిందన్నారు. నా పాత్ర ఏదైనా చిన్న గే రోల్ ఉంటుందని భావించానని తెలిపారు. లుక్ టెస్ట్ కోసం పిలిస్తే మొదట తాను వెళ్లలేదన్నారు. షూట్‌కు వెళ్లే వరకు నా రోల్ ఏంటనేది కూడా తెలియదన్నారు. ఈ సినిమా పాత్రపై నాకు ఎక్కడా కూడా సంతృప్తిగా అనిపించలేదని తెలిపారు.

కానీ డైరెక్టర్ శివ నన్ను పిలిచి మేకప్ వేసి మరి రెడీ చేశారు. నువ్వు సిగరెంట్, మందు తాగుతావు.. ఈ మూవీలో నువ్వు ఒక సైకోలా చేయాలని డైరెక్టర్ చెప్పారు. ఇదంతా విని నేను షాకయ్యా.. రవితేజ క్యారవాన్ దిగి రాగానే నాకు చెమటలు పట్టాయని అన్నారు. ఆయన రాగానే గళ్ల పట్టుకుని రవితేజను కొట్టాలని డైరెక్టర్ చెప్పారు.. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. అదే సీన్‌లో రవితేజను ఒక బూతు మాట అనాలని కూడా చెప్పారు.. కానీ అప్పుడే నాలో భయం మొదలైందని కొమురం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెద్ద హీరో కదా.. సింగిల్ టేక్‌లో చేయకపోతే బాగుండదని చెమటలు పట్టేశాయని కొమురం తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగులు అనే విలన్ పాత్రలో కొమురం ఆకట్టుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement