భారీగా పెరిగిన చాయ్‌ ధర! | Hyderabad Tea Price Hike News, Irani Chai And Dum Chai Prices Surge As Sugar Rates Rise | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన చాయ్‌ ధర!

Aug 26 2026 11:03 AM | Updated on Aug 26 2026 11:37 AM

chai price hike

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాదీలకు ఎంతో ప్రియమైన చాయ్‌ ధర అమాంతం కొండెక్కింది. నిన్నమొన్నటి వరకు గల్లీ షాపుల్లో రూ.10 ఉన్న కప్పు టీ ధర ఎప్పుడు ఏకంగా రూ.20కి చేరింది. ఇక ఓ మోస్తరు టీస్టాళ్లు, ఇరానీ హోటళ్లలో ఏకంగా రూ.25 నుంచి రూ.30 తీసుకుంటున్నారు. ఎందుకిలా అంటే.. చక్కెర ధర పెరగడమే కారణమని తెలుస్తోంది. కిలో చక్కెర రూ.69కి చేరడంతో చాయ్‌ ధర పెంచక తప్పలేదని నిర్వాహకులు చెబుతున్నారు. 

పాతబస్తీ, చార్మినార్, అబిడ్స్, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి పరిధిలోని ఇరానీ కేఫ్‌లలో ఇరానీ చాయ్‌ రూ.30, దమ్‌ చాయ్‌ రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం టీ తాగేవారికి రోజుకు రూ.20, నెలకు రూ.600 అదనపు భారం పడుతోంది. ఇక స్వీట్ల ధరలూ పెరిగాయి. చక్కెర ధర పెరుగుదల కారణంగా అన్ని రకాల స్వీట్ల పైన కిలోకు రూ.50 నుంచి 100 వరకు పెంచేశారు. 

ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు


 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement