న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తన ప్యాసింజర్ వాహనాల పోర్ట్‌ఫోలియోకు కొత్త బ్రాండ్ గుర్తింపుగా ‘టాటా.కార్స్’ను గురువారం ఆవిష్కరించింది.
యువ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇకపై హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ప్రీమియం ఎస్‌యూవీలు, ఈవీలను ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నారు. ‘నథింగ్స్ టూ ఫార్’ నినాదంతో రూపొందిన ఈ బ్రాండ్ వినియోగదారులకు కొత్త అవకాశాలను చేరువ చేస్తుందని టీఎంపీవీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు.


