‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌2’ వచ్చేసింది.. రూ.10 వేలతో బుకింగ్‌! | Yamaha YZF R2 Launched in India Know The Price Details | Sakshi
Sakshi News home page

‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌2’ వచ్చేసింది.. రూ.10 వేలతో బుకింగ్‌!

Aug 28 2026 1:43 AM | Updated on Aug 28 2026 1:43 AM

Yamaha YZF R2 Launched in India Know The Price Details

ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా మోటార్‌ తన సూపర్‌స్పోర్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ గురువారం నూతన ‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌2’ బైక్‌ను విడుదల చేసింది. చెన్నై యూనిట్‌లో ఉత్పత్తి అవుతున్న ఈ లైట్‌వెయిట్‌ స్పోర్ట్స్‌బైక్‌ ధరను రూ.2.30 లక్షలుగా (ఎక్స్‌–షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది.

పదివేల రూపాయల టోకెన్‌ అమౌంట్‌తో ఈ బైక్‌ ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 200సీసీ లిక్విడ్‌–కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 26.5 బీహెచ్‌పీ పవర్, 19.1 ఎన్‌ఎమ్‌ పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ కేటీఎమ్‌ ఆర్‌సీ 200, సుజుకీ గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250, రాబోయే హోండా సీబీఆర్‌300ఆర్‌ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement