జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే! | Jeep Compass 85th Anniversary Edition Launched in India | Sakshi
Sakshi News home page

జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!

Aug 17 2026 3:10 PM | Updated on Aug 17 2026 3:21 PM

Jeep Compass 85th Anniversary Edition Launched in India

ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. జీప్ ఇండియా 'కంపాస్ 85వ యానివెర్సరీ ఎడిషన్'ను లాంచ్ చేసింది. భారతదేశంలో కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో.. అదనపు భద్రత, ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన బాహ్య, అంతర్గత స్టైలింగ్ అంశాలు కూడా ఉన్నాయి.

కంపాస్ 85వ యానివెర్సరీ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కొత్త అప్డేట్స్ చూడవచ్చు. ఇందులో  గ్లాస్ బ్లాక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, వార్షికోత్సవ థీమ్‌తో కూడిన డీటైలింగ్ కూడా ఉన్నాయి. క్యాబిన్ పూర్తిగా నలుపు రంగు థీమ్‌తో పాటు మాయన్ గోల్డ్ యాక్సెంట్‌లు, కాంట్రాస్ట్ డీటైలింగ్‌ను కలిగి ఉంటుంది.

జీప్ తన 85వ యానివెర్సరీ ఎడిషన్ కోసం ఏఎక్స్ఎస్ పర్సనలైజేషన్ ప్యాకేజీల ద్వారా అనేక రకాల యాక్సెసరీలను కూడా అందిస్తోంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ ఇల్యూమినేషన్, ఫ్రంట్ అండ్ వెనుక డాష్‌క్యామ్‌లతో కూడిన డిజిటల్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ ఉన్నాయి. అయితే ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు లేదు.

జీప్ కంపాస్ 85వ వార్షికోత్సవ ఎడిషన్‌ను భారతదేశం అంతటా కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసి విక్రయించనున్నారు. అధీకృత జీప్ డీలర్‌షిప్‌లు మరియు జీప్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ధర రూ. 26.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement