దేవిశ్రీ ప్రసాద్‌కి జోడీగా అనంతిక! | Devi Sri Prasad Yellamma Movie Female Lead Ananthika Confirmed | Sakshi
Sakshi News home page

Yellamma Movie: దేవిశ్రీ ప్రసాద్‌కి జోడీగా అనంతిక!

Sep 17 2026 11:53 AM | Updated on Sep 17 2026 11:53 AM

Devi Sri Prasad Yellamma Movie Female Lead Ananthika Confirmed

'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'ఎల్లమ్మ'. ఎప్పటినుంచో సెట్స్ మీద ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ల క్రితం గ్లింప్స్ లాంటి వీడియో రిలీజ్ చేశారు.  ఆ తరువాత దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  మళ్లీ ఇన్నాళ్లకు మరో అప్‌డేట్‌ వచ్చినట్లు​ తెలుస్తోంది.

ఈ సినిమాలో దేవిశ్రీ సరసన ఎవరు నటిస్తారనే చర్చ ఉంది. అయితే ఈ ఛాన్స్‌ అనంతిక సనిల్‌కుమార్ కొట్టేసిందట. ఇప్పటికే  'మ్యాడ్', '8 వసంతాలు', 'రోమాంచకం' వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ తార. ఇదే నిజం అయితే మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  
ఇదీ చదవండి: ఎంఎస్‌ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు: అల్లు అరవింద్‌
ఇప్పటికే విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో పార్సి అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. క్లీన్ షేవ్ చేసిన లుక్‌లో దేవి డిఫరెంట్‌గా ఉన్నాడు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement