‘ఎంఎస్‌ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు’ | Producer Allu Aravind Speech Highlights At M S A Legacy On Screen Launch Event, Watch Full Video Inside | Sakshi
Sakshi News home page

Allu Aravind: సుబ్బులక్ష్మి బయోపిక్‌.. ఈ సాహసం చేయలేం: అల్లు అరవింద్‌

Sep 17 2026 9:12 AM | Updated on Sep 17 2026 10:15 AM

 Producer Allu Aravind Speech At M S A Legacy On Screen Launch event

గౌతమ్‌ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో విద్యాంసురాలు ఎం.ఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎం.ఎస్’. అల్లు అరవింద్, రాక్‌లైన్‌ వెంకటేష్, బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు.  బుధవారం ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో  అల్లు అరవింద్‌ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ బయోపిక్‌ తీయాలని స్ఫూర్తి పొందాం
‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిసిన తర్వాత ఈ బయోపిక్‌ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎంఎస్‌ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించారో చాలా మందికి తెలీదు. అమ్మ సంగీతాన్ని రీక్రియేట్‌ చేసేంత గొప్పవాళ్లం కాదు. అందుకే అనిరుధ్‌ సంగీతంతో ఓ గొప్ప బయోపిక్‌ తీయాలని నిర్ణయించుకున్నాం’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. 

కాగా చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్మికపై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి కమల్‌హాసన్‌ క్లాప్‌ ఇచ్చారు.  ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు.
 (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement