విద్యార్థుల ముందే టీచర్‌పై కాల్పులు, ప్రియుడి ఆత్మహత్య | UP school tragedy exlover drags teacher away in front of students shoots her | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ముందే టీచర్‌పై కాల్పులు, ప్రియుడి ఆత్మహత్య

Sep 22 2026 4:59 PM | Updated on Sep 22 2026 5:03 PM

UP school tragedy  exlover drags teacher away in front of students shoots her

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో  దారుణ ఘటన చోటు చేసుకుంది.  తన ప్రియురాలు తమ సంబంధాన్ని ముగించడంతో ఆగ్రహానికి గురైన 27 ఏళ్ల యువకుడు ప్రియురాల్ని కాల్చి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకొని  చనిపోయిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటన సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో జరిగింది. మృతురాలిని 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు నిషాత్ ఫాతిమాగా గుర్తించారు. ఆమె సుమారు ఏడాదిగా ఇక్కడ పనిచేస్తోంది   నిషత్ ఫాతిమా, సౌద్‌లు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, అయితే ఇటీవలే ఫాతిమా ఆ సంబంధానికి స్వస్తి పలికిందని పోలీసులు తెలిపారు. అందుకే అతను ఈ దారుణానికి  పాల్పడినట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి: రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు

 సంఘటన ఎలా జరిగింది? 
 పోలీసులు సమాచారం ప్రకారం ప్రియురాలు తనతో సంబంధాన్ని తెంచుకుందన్న కోపంతో 27 ఏళ్ల మొహమ్మద్ సౌద్  లఖింపూర్ ఖేరీలోని 'చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్'లోకి ప్రవేశించాడు.   ఒక సంచిలో పిస్టల్‌ను దాచుకుని పాఠశాలకు వచ్చాడు. ఫాతిమాను కింది అంతస్తుకు పిలిచి, ఆ తర్వాత ఆమెను పై అంతస్తులోని ఒక కారిడార్‌లోకి తీసుకెళ్లాడు. వారు పైకి వెళ్తుండగా, ఒక సిబ్బంది వారిని అనుసరించారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కారిడార్‌లో సంభాషణ జరుగుతుండగా, సౌద్ పిస్టల్‌ను బయటకు తీసి ఫాతిమా తలపై కాల్చాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకున్నాడు.  దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.విద్యార్థులు, సిబ్బంది చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో పాఠశాలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

విద్యార్థులు చూస్తుండగానే, సౌద్ ఫాతిమాను చేయి పట్టుకుని పై అంతస్తుకు లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. అతను ఆమెను లాక్కెళ్తుండగా ఫాతిమా ప్రతిఘటించినట్లు  కూడా ఈ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయని,  దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement