మోదీ ఫొటోకు నెక్లెస్, చెవి రింగులు | Jewellers protest at Ramlila Maidan against Centre's excise duty proposal | Sakshi
Sakshi News home page

మోదీ ఫొటోకు నెక్లెస్, చెవి రింగులు

Mar 17 2016 4:10 PM | Updated on Sep 3 2017 7:59 PM

మోదీ ఫొటోకు నెక్లెస్, చెవి రింగులు

మోదీ ఫొటోకు నెక్లెస్, చెవి రింగులు

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం వ్యాపారులు కదం తొక్కారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం వ్యాపారులు కదం తొక్కారు. బంగారం కొనుగోళ్లు, ఉత్పత్తి వ్యవహారంలో కొత్త నిబంధనలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ రాంలీలా మైదానంలో ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు ఈ సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పోస్టర్లను ప్రదర్శించారు. మోదీ, జైట్లీ బంగారు నెక్లెస్ లు, చెవికమ్మెలు, ముక్కెరలు ధరించినట్టుగా పోస్టర్లలో చూపించారు.

రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొంటే పాన్ కార్డును తప్పని చేశారు. అలాగే, ఉత్పత్తి మీద ఎక్సైజ్ సుంకం 1 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బంగారం వర్తకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దుకాణాలు మూసేసి గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement