డ్రాగన్‌ ఫ్రూట్‌తో... సీజనల్‌ వ్యాధులకు చెక్‌! | Dragon Fruit Health Benefits, Why Eating This Superfruit During Monsoon Can Boost Immunity And Health | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ ఫ్రూట్‌తో... సీజనల్‌ వ్యాధులకు చెక్‌!

Jul 25 2026 9:56 AM | Updated on Jul 25 2026 10:14 AM

Health: Keep Seasonal Diseases At Bay With Dragon Fruit

హెల్త్‌

చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్‌ ఫ్రూట్‌ పోషకాల గని. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫ్రూట్‌ని ముఖ్యంగా వర్షాకాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు...

  • డ్రాగన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్‌ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షించి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకు పోకుండా కాపాడుతుంది.

  • ఈ పండులో సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో సాధారణంగా ఇబ్బంది పెట్టే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

  • వర్షాకాలంలో చాలామందిని వేధించే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు ఈ పండు చక్కని పరిష్కారం. ఇందులో ఉండే పీచుపదార్థం ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేసి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

  • ఈ పండులోని యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, అస్తమా, అలర్జీల వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.

  • వాతావరణంలో పెరిగే తేమ, కాలుష్యం వల్ల చర్మం జీవం కోల్పోకుండా ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంచుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement