పెస్కటేరియన్‌ డైట్‌తో స్థూలకాయం దూరం! | Health: Keep Obesity At Bay With A Pescatarian Diet | Sakshi
Sakshi News home page

పెస్కటేరియన్‌ డైట్‌తో స్థూలకాయం దూరం!

Jul 25 2026 10:05 AM | Updated on Jul 25 2026 10:05 AM

Health: Keep Obesity At Bay With A Pescatarian Diet

హెల్త్‌

రోగ్యంగా, ఆనందంగా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. అందువల్ల పెస్కటేరియన్‌ డైట్‌ అనుసరించడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

పెస్కటేరియన్‌ డైట్‌ అంటే...?
శాకాహారంలో చేపలు, రొయ్యలు సంబంధిత సీఫుడ్‌లను చేర్చుకోవడాన్ని పెస్కటేరియన్‌ డైట్‌ అంటారు. శాకాహారంలోని పోషకాలతో పాటు చేపలలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి లభించడం ఈ డైట్‌ ప్రత్యేకత.

ఈ డైట్‌ పాటించడం వల్ల...

  • స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది.

  • ధమనులలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.

  • మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

  • శరీరంలో అంతర్గత వాపులు, మంటలను తగ్గించి కణాల జీవక్రియను వేగవంతం చేస్తుంది.

  • మాంసాహారులతో పోలిస్తే, పెస్కటేరియన్‌ విధానాన్ని పాటించేవారిలో అకాల మరణ ముప్పు దాదాపు 18% తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధులకు, స్థూలకాయంతో బాధపడేవారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement