ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్‌ గాంధీ | LoP Rahul Gandhi on Dharmendra Pradhan Resign | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్‌ గాంధీ

Jul 25 2026 5:10 PM | Updated on Jul 25 2026 5:16 PM

LoP Rahul Gandhi on Dharmendra Pradhan Resign

న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మన విద్యా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చాలా పెద్ద అడుగని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. శనివారం ఆయన ఎక్స్‌లో వీడియో రూపంలో మాట్లాడారు.

‘‘దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులందరికీ అభినందనలు. మీ అందరిని చూస్తుంటే గర్వంగా ఉంది. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తును కాపాడేందుకు ధైర్యంగా నిలిచిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. విద్యార్థులను, భారత భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులు, కార్మికులు, పేదలు, ఈ ప్రభుత్వం అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటమే నిజమైన ధైర్యం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించే సమయం వచ్చింది. భయపడొద్దు’’ అని పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement