ప్రముఖ రెస్టారెంట్‌ బార్బిక్యూ నేషన్‌లో కుళ్లిన మాంసం | Food Safety Officials Conducted Surprise Raids At BBQ Nation Restaurant In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రముఖ రెస్టారెంట్‌ బార్బిక్యూ నేషన్‌లో కుళ్లిన మాంసం

Jul 3 2026 8:02 AM | Updated on Jul 3 2026 9:30 AM

Food Safety officials conducted surprise raids at BBQ Nation restaurant

హైదరాబాద్‌: ప్రముఖ రెస్టారెంట్‌ బార్బిక్యూ నేషన్‌లో నిబంధనల ఉల్లంఘనలు మరోసారి వెలుగు చూశాయి. అత్తాపూర్‌లోని బార్బిక్యూ నేషన్‌ రెస్టారెంట్‌లో హెచ్‌– ఫాస్ట్, ఫుడ్‌సేప్టీ అధికారులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్రిజ్‌లో కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. కిచెన్‌ లోపల అపరిశుభ్రత వాతావరణం కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 పాడైపోయిన చికెన్, మూడు కేజీల మటన్, రెండు చేపలు, గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. పాడైపోయిన, నిల్వ ఉన్న మాంసంపై పాత స్టిక్కర్లను తొలగించి, కొత్తగా ప్యాక్‌ చేస్తున్నారు. గతంలోనూ ఇదే రెస్టారెంట్‌లో ఫుడ్‌సేప్టీ అధికారులు లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అయినా యాజమాన్యం తీరులో మార్పు రాలేదని ఫుడ్‌సేఫ్టీ అధికారి సౌమ్యారెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement