నేడో, రేపో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌! | SIT takes custody of drug case accused from Chanchalguda jail | Sakshi
Sakshi News home page

నేడో, రేపో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌!

Mar 25 2026 4:58 AM | Updated on Mar 25 2026 4:58 AM

SIT takes custody of drug case accused from Chanchalguda jail

చంచల్‌గూడ జైలు నుంచి డ్రగ్స్‌ కేసు నిందితులను కస్టడీకి తీసుకున్న ‘సిట్‌’

శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ..హాజరైన ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు

కొత్తగా మరో నలుగురి పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం

మొయినాబాద్, శంషాబాద్‌ రూరల్‌: ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులను సిట్‌ విచారించింది. రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితీష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్‌ వ్యాపారి నమిత్‌శర్మను మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకొని బందోబస్తు మధ్య శంషాబాద్‌ ఠాణాకు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. మొదట రోహిత్‌రెడ్డితో ప్రారంభించి, ముగ్గురిని వేర్వేరుగా విచారించారు.

సిట్‌ బృందం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు మధ్యాహ్నం శంషాబాద్‌ ఠాణాకు వచ్చి నిందితులను స్వయంగా విచారించారు. వేర్వేరుగా ముగ్గురిని విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులతో పార్టీలు మాత్రమే జరుగుతుంటాయని రోహిత్‌రెడ్డి అడ్వొకేట్‌ శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో తెలిపారు. పాత సంఘటలను కాకుండా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే విచారించాలని కోర్టు సూచించినట్టు చెప్పారు. 

డ్రగ్స్‌ కొనుగోలు, కాల్పుల వ్యవహారంపై ఆరా 
కాల్పుల వ్యవహారం, డ్రగ్స్‌ కొనుగోలు అంశాలపై సిట్‌ అధికా రులు నిందితులను ప్రశ్నించినట్టు తెలిసింది. డ్రగ్స్‌ ఎక్కడ కొను గోలు చేశారు.. ఎవరు సరఫరా చేశారు.. డ్రగ్స్‌ పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి వంటి ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాల్పుల వ్యవహారంపై నమిత్‌శర్మను ప్రశ్నించి పలు విషయాలు తెలుసు కున్నారు. 

డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేసింది రోహిత్‌రెడ్డే కావడంతో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు సిట్‌ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విచారణలో  నాలుగు కొత్త పేర్లు బయటకొచ్చినట్టు సమాచారం. మిగిలిన రెండు రోజుల విచారణలో డ్రగ్స్‌ మూలాలకు సంబంధించిన వివరా లను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement