డ్రగ్స్‌ కేసు : అజ్ఞాతంలోకి నటుడు కృష్ణ! | Tamil Actor Krishna Goes Absconding Amid Drug Case Investigation, More Details Inside | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు : అజ్ఞాతంలోకి నటుడు కృష్ణ.. పోలీసుల గాలింపు!

Jun 25 2025 2:43 PM | Updated on Jun 25 2025 3:25 PM

Tamil Actor Krishna Goes Absconding Amid Drug Case Investigation

మాదక ద్రవ్యాల వ్యవహారం కోలీవుడ్‌లో విశ్వరూపం దాల్చుతోందనిపిస్తోంది. డ్రగ్స్‌ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కాగా మరో తమిళ నటుడు కృష్ణ కూడా మాదక ద్రవ్యాలను వాడినట్లు సమచారం అందడంతో పోలీసులు ఆయన్ని విచారించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం కేరళలో షూటింగ్‌లో పాల్గొంటున్న నటుడు కృష్ణను విచారించడానికి పోలీసులు కేరళకు వెళ్లారు. అయితే కృష్ణ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.  తమిళ ఇండస్ట్రీలోని అనేక యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు పరిచయాలు ఉన్నాయి. దీంతో అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఈ డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. మరి ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement