ఆతిథ్య రంగ కంపెనీ తాజ్‌జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ తాజాగా కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యాజమాన్య మార్పిడి నేపథ్యంలో అక్టోబర్ 30నుంచి కొత్త పేరుతో సేవలు అందిస్తోంది. కంపెనీలోగల మొత్తం 25.52 శాతం వాటాను జీవీకే భూపాల్ ప్రమోటర్ కుటుంబానికి టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్‌సీఎల్) విక్రయించిన విషయం విదితమే. దీంతో 2025 డిసెంబర్ 30న ఐహెచ్‌సీఎల్ నామినీ డైరెక్టర్లు తాజ్‌జీవీకే బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొత్తగా సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే దీర్ఘకాలిక నిర్వహణా ఒప్పందాలలో భాగంగా తాజ్ బ్రాండ్‌తోనే సంస్థ హోటళ్ల పోర్ట్‌ఫోలియోను ఐహెచ్‌సీఎల్ నిర్వహించనుంది.
1995లో షురూ
తాజ్‌జీవీకే హోటల్స్ 1995లో ఐహెచ్‌సీఎల్, జీవీకే భూపాల్ కుటుంబం మధ్య భాగస్వామ్య సంస్థగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రమోటర్ కుటుంబం కంపెనీని సొంతం చేసుకుంది. లగ్జరీ విభాగంపై కంపెనీ దృష్టి, స్ట్రక్చర్ కొత్త పేరులో ప్రతిబింబిస్తున్నట్లు కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. కృష్ణా జీవీకే ప్రస్తుతం హైదరాబాద్‌సహా చెన్నై, చండీగఢ్, ముంబైలలో ఆరు హోటళ్లు కలిగి ఉంది. తదుపరి దశ వృద్ధి బెంగళూరులో ప్రారంభంకానున్నట్లు సంస్థ వెల్లడించింది. కృష్ణా జీవీకే పేరుతో 256 గదుల తాజ్ యెలహంక హోటల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియో 7కు చేరినట్లు తెలియజేసింది. ఈ నెలాఖరుకల్లా కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?


