సాక్షి,విజయవాడ:కోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారలేదు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించి నోటీసులు ఇచ్చే పేరుతో పోలీసులు రాత్రి సమయంలో ఆమె నివాసానికి వెళ్లారు.
అర్ధరాత్రి వేళ ఇళ్లకు వచ్చి తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురిచేయడంపై మాజీ మేయర్ భాగ్యలక్ష్మి దంపతులు పోలీసులను తీవ్రంగా నిలదీశారు. కోర్టు చివాట్లు పెట్టినా పోలీసుల తీరులో మార్పు రాలేదని మండిపడ్డారు.


