
చెన్నై: కోలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.
విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్‌లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.
చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్