
సాక్షి, శేరిలింగంపల్లి: ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన సదరు వైద్యురాలు.. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో, ఆమెను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ.. మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు. ఈ క్రమంలో ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, రూ.5 లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్ లైన్ ద్వారా పంపించింది.
అనంతరం, టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్(38)కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంప్యార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత
ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్లో దొరికిన చిగురుపాటి నమ్రత
వంశ్ టక్కర్‌కు… pic.twitter.com/A03UqI0JvZ— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025
Credit: Telugu Scribe