పైలెట్ రోహిత్ రెడ్డి విడుదల | Pilot Rohit Reddy Released On Bail In Drug Case With Strict Conditions Set By High Court, More Details Inside | Sakshi
Sakshi News home page

పైలెట్ రోహిత్ రెడ్డి విడుదల

Apr 29 2026 9:06 AM | Updated on Apr 29 2026 10:22 AM

Pilot Rohit Reddy Granted Bail in Moinabad Drugs Case

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పైలెట్‌ రోహిత్‌రెడ్డి బుధవారం ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు. నిన్న  హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. మొయినాబాద్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ వో ఎదుట 8 వారాలు లేదా చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు.. ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరుకావాలని షరతులు విధించింది. 

బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 483(2) లోని షరతులన్నీ పాటించాలని, పాస్‌పోర్టును ట్రయ ల్‌కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో గత నెల అను మతి లేకుండా భారీ మద్యం, డ్రగ్స్‌ పార్టీ జరుగుతు న్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన విషయం విదితమే. రోహిత్‌రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌కు కూడా పోలీసులకు చిక్కారు. 

మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో బెయిల్‌ కోరుతూ రోహిత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తి చేసిన జస్టిస్‌ సుజన కళాసికం ధర్మాసనం ఈ నెల 21న తీర్పు రిజర్వు చేసింది. మంగళవారం రోహిత్‌రెడ్డి బెయిల్‌కు అనుమతిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement