
సాక్షి, హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు అక్రమంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ మధ్యలో హెరాయిన్ ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మట్టి గాజుల మాటున కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 10 కొరియర్ సంస్థల నుండి రెండేళ్లలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ తరలించినట్టు పోలీసులు గుర్తించారు.
కొరియర్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు గం జాయి రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టును ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) టీం రట్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు ఈ గంజాయి చేరవేస్తున్నట్టు ఆధారాలు లభించాయి.
జీడిమెట్లలోని సూరారంలో శివాలయం కాలనీలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ డ్రగ్ రాకెట్‌లో కీలకంగా పనిచే స్తున్న నలుగురిని అరెస్టు చేసి.. 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న 50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. ఓ నైజీరియన్ తన నెట్‌వర్క్ ద్వారా ఢిల్లీ, బీదర్ నుంచి పలు కంపెనీల పేరిట కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్ కు చేరవేడయంతో పాటు స్థానికంగా ఉన్న పెడ్లర్ల ద్వారా మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
ఈ ఆపరేషన్‌లో మణిపూర్‌కు చెందిన నెవెల్ టాంగ్ బ్రామ్‌తో పాటు అంబటి గణేశ్, బూసా శివకుమార్, మహ్మద్ అషర్ జావేద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. యూనివర్సిటీకి చెందిన 14 మం ది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మల్నాడు రెస్టారెంట్ కేసులో లింకులతో.. మల్నాడు రెస్టారెంట్ కేసు విచారణ సందర్భంగా తెరపైకి వచ్చిన శ్రీమారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ రాజేష్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ పేరిట రెండు పార్సిళ్లు డీటీడీసీ కొరియర్ సంస్థ ద్వారా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. ఆ పార్సిళ్లపై ఉన్న మొబైల్ నంబర్లు భారతీయ మొబైల్ నంబర్లుగానే ఉన్నా.. నైజీరియా నుంచి నిక్ అనే వ్యక్తి వాడుతున్నట్లు తేలింది.
