డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్ | Cinematographer Sameer Thahir Arrested | Sakshi
Sakshi News home page

Sameer Thahir: మొన్న ఇ‍ద్దరు డైరెక్టర్స్ అరెస్ట్.. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్

May 6 2025 5:59 PM | Updated on May 6 2025 6:05 PM

Cinematographer Sameer Thahir Arrested

డ్రగ్స్ కేసుల వల్ల మలయాళ చిత్రసీమ హాట్ టాపిక్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ వాడుతున్నాడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కాసేపటికే బెయిల్ పై రిలీజయ్యాడు. వారం క్రితం ఇద్దరు మలయాళ దర్శకుల్ని ఇదే తరహా కేసులో అరెస్ట్ చేశారు. 

(ఇదీ చదవండి: ‍మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)

ఇప్పుడు ఈ కేసులో మరో అప్డేట్. అరెస్ట్ అయిన సదరు దర్శకులు ఖలీద్ రెహ్మాన్, అష్రఫ్ హమ్జాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ సమీర్ తాహిర్ ని కూడా సోమవారం నాడు ఇదే డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లతో ఇతడికి సంబంధం ఉందనే ఆరోపణలతోపాటు ఇతడు అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో వీళ్లు ఉండటం దీనికి కారణం.

అయితే తాను అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తనకు తెలియదని సమీర్ తాహిర్.. పోలీసులతో చెప్పుకొచ్చాడు. అయినా సరే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఇతడిపై కేసు నమోదు చేశారు. కానీ కాసేపటికే ఇతడు కూడా బెయిల్ పై బయటకొచ్చాడు.

(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)

Advertisement
 
Advertisement
Advertisement