ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ | Tollywood actress Hema Comments at Meet The press | Sakshi
Sakshi News home page

Hema: ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ

Mar 31 2026 9:02 AM | Updated on Mar 31 2026 9:40 AM

Tollywood actress Hema Comments at Meet The press

టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత ఆమెను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు.   నిర్వహించా ఈ సందర్భంగా ఆ సమయంలో తాను ఎదుర్కొన్న  ఇబ్బందులను పంచుకున్నారు.
 
డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు  తీవ్రంగా మానసికంగా కలచివేశాయని తెలిపింది. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు అంతలా నన్ను మానసికంగా కుంగిదీసిందని వెల్లడించింది.  అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేసింది. నాపై వచ్చిన తప్పుడు వార్తల వల్ల తన కుటుంబం  చాలా బాధపడిందన్నారు.

మీట్ ది ప్రెస్‌లో హేమ మాట్లాడుతూ....'డ్రగ్స్ కేసులో కొందరు తనపై నిరాధార ఆరోపణలు చేశారు. వాటితో తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ఆ సమయంలో  చాలా సఫర్ అయ్యా. అది నాకు చాలా కఠినమైన కాలం. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలనిపించింది' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement