
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్‌డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు.
అలాగే పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు. సింగర్‌తో పాటు రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోక్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన మంగ్లీ. ఆ ఫేంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్లో పాటలు ఆలపిస్తూ..తక్కువ సమయంలోనే స్టార్ సింగర్‌గా ఎదిగింది. బన్నీ, ఎన్టీఆర్, మహేశ్ బాబుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడింది.
