న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా? | Indira Gandhi Assassination Link Surfaces In New Zealands Biggest Meth Bust | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా?

Mar 31 2026 11:01 AM | Updated on Mar 31 2026 11:36 AM

Indira Gandhi Assassination Link Surfaces In New Zealands Biggest Meth Bust

ఆక్లాండ్: న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యంత భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బల్తేజ్ సింగ్‌కు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఇప్పుడు అతని వెనుక ఉన్న ఒక సంచలన చరిత్ర అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపిన హంతకుల్లో ఒకరైన సత్వంత్ సింగ్‌తో బల్తేజ్ సింగ్‌కు కుటుంబ పరమైన సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది

ఎవరీ బల్తేజ్ సింగ్?
ఆక్లాండ్ నగరంలో వ్యాపారవేత్తగా చలామణి అవుతున్న బల్తేజ్ సింగ్, తెర వెనుక భారీ అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను నడిపాడు. దాదాపు 700 కేజీల మెతాంఫేటమిన్ (Methamphetamine) అనే మత్తు పదార్థాన్ని న్యూజిలాండ్‌లోకి అక్రమంగా తరలించినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ అనంతరం మార్చి 30న న్యూజిలాండ్ కోర్టు అతనికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ఇందిరా గాంధీ హత్యతో లింక్ ఏంటి?
శిక్ష ఖరారైన తర్వాత బల్తేజ్ సింగ్ కుటుంబ నేపథ్యంపై ఆసక్తికర చర్చ మొదలైంది. 1984 అక్టోబర్ 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమె నివాసంలోనే అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన ఈ దారుణం దేశాన్ని కుదిపేసింది. అయితే, ఈ హంతకుల్లో ఒకరైన సత్వంత్ సింగ్‌కు బల్తేజ్ సింగ్ బంధువని దర్యాప్తులో తేలింది.

గుట్టు రట్టయిందిలా..
బల్తేజ్ సింగ్ నెట్‌వర్క్ చాలా తెలివిగా డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేది. బీర్ క్యాన్లలో అత్యంత నాణ్యమైన డ్రగ్స్‌ను దాచి సరిహద్దులు దాటించేవారు. అయితే 2023లో ఒక వ్యక్తి పొరపాటున డ్రగ్స్ కలిపిన ద్రవాన్ని తాగి ప్రాణాలు కోల్పోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో బల్తేజ్ సింగ్ డ్రగ్ కింగ్ అని తేలింది.

బల్తేజ్ సింగ్ వేడుకోలు
తన కుటుంబ నేపథ్యం వల్ల భవిష్యత్తులో ముప్పు ఉంటుందని, తన పేరును బయటకు వెల్లడించవద్దని (Name Suppression) బల్తేజ్ సింగ్ కోర్టును ఆశ్రయించాడు. కానీ అందరికీ ఈ కేసు గురించి తెలుసుకునే హక్కు ఉందని భావించిన కోర్టు, అతని విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కేసుతో 1984 నాటి విషాదకర ఘటనలు, ఆ తర్వాతి అల్లర్ల చరిత్ర మరోసారి విదేశీ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక  హంతక కుటుంబానికి చెందిన వ్యక్తి, మరో దేశంలో భారీ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించడంపై ప్రపంచవ్యాప్తంగా  చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: ‘ఎయిర్‌ ఇండియా’లో ‘పాన్‌ పాన్‌’ కాల్‌... ప్రయాణికులు బెంబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement