మూడేళ్లలో 58 మంది విదేశీయులు తిరిగి స్వదేశాలకు.. | Over 58 foreign nationals arrested for overstaying and massive drug haul seized | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో 58 మంది విదేశీయులు తిరిగి స్వదేశాలకు..

Apr 21 2026 12:56 AM | Updated on Apr 21 2026 12:56 AM

Over 58 foreign nationals arrested for overstaying and massive drug haul seized

డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడి విదేశీయులను డిపోర్టేషన్‌ చేస్తున్న ఈగల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి సింథటిక్‌ డ్రగ్స్‌లో పట్టుబడినా.. వాటి సప్లయ్‌చైన్‌లో కీలక వ్యక్తులు విదేశీయులే. ఇలా మత్తుపదార్థాల రవాణాకు అలవాటుపడి డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతున్న విదేశీయులపై ఈగల్‌ అధికారులు డిపోర్టేషన్‌ అస్త్రం ప్రయోగిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులలో అరెస్టయిన నైజీరియన్లు, ఇతర దేశస్తులు బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ డ్రగ్స్‌ సరఫరా దందాను మొదలు పెడుతున్నారు. హైదరాబాద్‌లో పట్టుబడితే బెంగళూరుకు మకాం మార్చడం..అక్కడా గుర్తిస్తే గోవా, ముంబై ఇలా అడ్డాలు మారుస్తూ అప్పటికే ఏర్పడిన కస్టమర్ల నెట్‌వర్క్‌కు వీరే మళ్లీ మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారు.

ఇలాంటి వారిని నిబంధనల ప్రకారం తిరిగి వారి దేశాలకు పంపుతున్నారు. విదేశీయుల రీజినల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్స్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో), ఇమ్మిగ్రేషన్‌ ప్రాసెస్‌ పూర్తి అయ్యేంత వరకు డిటెన్షన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్లను తిరిగి వారి దేశాలకు పంపుతున్నారు. 2023 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 19 వరకు మొత్తం 58 మంది విదేశీయులను డిపోర్టేషన్‌ చేశారు.  అత్యధికంగా 2025లో 42 మంది విదేశీయులను డిపోర్టేషన్‌ చేయగా వీరిలో 22 మంది నైజీరియన్లు ఉన్నట్టు అధికారిక సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement