హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’? | Maa President Manchu Vishnu Message On Actress Hema case | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: నటి హేమ కేసు.. మంచు విష్ణు కీలక నిర్ణయం!

Jun 5 2024 6:11 PM | Updated on Jun 5 2024 7:25 PM

Maa President Manchu Vishnu Message On Actress Hema case

మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్‌ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్‌ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్‌కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. 

అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్‌ చిట్‌ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది  రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. 

కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్‌ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement