న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులా? | Yadav associations lash out at the APGovt vindictive actions | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులా?

Jul 2 2026 10:01 PM | Updated on Jul 2 2026 10:01 PM

Yadav associations lash out at the APGovt vindictive actions

ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో నిరుపేద యాదవ గొర్రెల కాపరులపై జరిగిన దారుణ హత్యాయత్నాన్ని నిరసిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా జరిగిన ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని యాదవ సంఘాలు అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఈదుముడి గ్రామంలో గొర్రెల కాపరుల తలలు పగలగొట్టి, కులం పేరుతో దూషించిన అరాచక శక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో పంపించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. బాధితుల పక్షాన నిలబడి గొంతెత్తిన నాగార్జున యాదవ్ గారిపై కేసు నమోదు చేయడం ఈ రాష్ట్రంలో నడుస్తున్న కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం. ప్రభుత్వ తప్పులను ఎండగడితే నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు కాక శ్రీనివాస్ అనే వ్యక్తితో కూటమి ప్రభుత్వం కావాలనే ఈ తప్పుడు ఫిర్యాదు చేయించింది.

‘నడిరోడ్డుపై రక్తం చిందించిన యాదవ బిడ్డల ప్రాణాల కంటే, కులం పేరుతో జరిగిన అవమానం కంటే ఈ ప్రభుత్వానికి తమ 'ఇమేజ్' ముఖ్యం అయిపోయిందా?
డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ శేషగిరిరావు వంటి అధికారులు చట్టాన్ని తమ సామాజిక వర్గం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి, పాలకుల బానిసలుగా మారి విపక్ష నేతలపై అక్రమ కేసులు రాస్తున్నారు.

ఓట్ల కోసం బీసీలు, యాదవులు కావాలి కానీ.. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? మీ అహంకార కుల రాజకీయాలకు యాదవ సమాజం చరమగీతం పాడటం ఖాయం.
యనమల నాగార్జున యాదవ్‌పై పెట్టింది కేవలం ఒక వ్యక్తిపై కేసు కాదు.. ఇది న్యాయం కోసం గొంతెత్తిన మొత్తం యాదవ, బీసీ సామాజిక వర్గంపై పెట్టిన కేసుగా భావిస్తున్నాం’ అని యాదవ సంఘాలు స్పష్టం చేశాయి.

26 నెలల్లో నాపై పెట్టిన అక్రమ కేసులు 12: నాగార్జున యాదవ్‌
‘ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో నిరుపేద యాదవ గొర్రెల కాపరులపై టీడీపీ నాయకులు కులం పేరుతో అత్యంత హేయంగా దూషించి, గడ్డపారలు, రాడ్లతో ప్రాణాంతకంగా దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు.ఒక బాధ్యతగల బీసీ బిడ్డగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా.. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నేను, పలు బీసీ, యాదవ సంఘాలతో కలిసి ఆ అమాయక బాధితుల పక్షాన నిలబడ్డాము. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపి, స్వయంగా కలెక్టర్ గారిని కలిసి న్యాయం చేయమని వినతిపత్రం ఇచ్చాను.
నిరుపేదలపై జరిగిన దారుణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే.. గద్దపారలతో సాటి మనుషుల తలలు పగలగొట్టిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో పంపించి, బాధితుల కోసం గొంతెత్తిన నాపై ఎదురు కేసులు పెట్టించడం దుర్మార్గం కాకపోతే ఇంకేంటి?,  శాంతిభద్రతలను కాపాడాల్సిన కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి, కూటమి పార్టీల నాయకులకు ప్రైవేట్ సైన్యంగా, ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 26 నెలల కాలంలో నాపై పెట్టిన అక్రమ కేసులు ఏకంగా 12కు చేరాయి!
‘2024 కంటే ముందు నాపై ఒక్కటంటే ఒక్క కేసు కూడా లేదు. నారా లోకేష్ . తప్పుడు కేసులు, అర్థం లేని బెదిరింపులు, అర్థరాత్రి అరెస్టులతో వైఎస్ జగన్ గారి సైనికులను, ఆయన కోట్లాది మంది అభిమానులను ఆపడం మీ తరం కాదని మీరెప్పుడు తెలుసుకుంటారో పాపం!, మాపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని కుట్రలు చేసినా జగనన్న పక్షాన నిలబడి మీ అరాచకాలను ఎండగడుతూనే ఉంటాం. ఏదేమైనా.. మా జగనన్న కోసం, సామాన్యుల న్యాయం కోసం తగ్గేదేలే!’అని స్సష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement