సాక్షి,తాడేపల్లి: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హాయంలో తెచ్చిన భూ సంస్కరణలపై ప్రశంసలు దక్కాయి. ఏపీ క్లీన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం వైఎస్ జగన్ కృషి చేశారని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ కుండబద్దలు కొట్టారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో గీతా గోపీనాథ్ చేసిన వ్యాఖ్యలతో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేసింది విషప్రచారమేనని తేటతెల్లమైంది.
ఎన్నికల ముందు ఈ చట్టం గురించి చంద్రబాబు విష ప్రచారం చేశారు. ఇప్పుడు అదే చట్టాన్ని దావోస్ వేదికగా ఇది ఇండియాకు రోల్ మోడల్ అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అధికారం కోసమే చంద్రబాబు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద విష ప్రచారం చేశారని అన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. సాక్షి న్యూస్ ఎక్స్ వేదికగా నిర్వహించిన ఎక్స్ స్పేస్‌లో ఆయన మాట్లాడారు.
దావోస్ వేదికగా ప్రపంచదేశాది నేతల సమక్షంలో వైఎస్ జగన్ తన హయాంలో తలపెట్టిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దేశానికే ఆదర్శమని ప్రకటించింది. కేంద్రం ఏపీ ల్యాండ్ టైటిల్లింగ్ యాక్ట్ దేశానికి రోల్‌మోడల్ అని చెబుతుంటే.. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇదే టైటిల్లింగ్ యాక్ట్ కాదని.. భూములాగేసే చట్టమని విష ప్రచారం చేశారని అన్నారు.
దేశాదినేతల సమక్షంలో కేంద్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రశంసలు కురిపించడం నిజంగా హర్షించదగిన విషయం. ఎందుకంటే విషప్రచారానికి ప్రయోగ వేదికలైన ఎల్లోమీడియా కర్కాణాల నుంచి వెలువడిన ఈ విష ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలింది. ఇది వైఎస్సార్‌సీపీకి మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలకు శుభపరిణామం.
అంతేకాదు. ల్యాండ్ రీ సర్వే తన విజన్ అని చంద్రబాబు చెప్పుకుంటున్నా.. వైఎస్ జగన్ హయాంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పురుడుపోసుకుందన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో టైటిల్ డీడ్ సరిగా లేదనో, పాస్ పుస్తకాలు లేవనో, పాస్ పుస్తకాల్లో లోపాలు ఉన్నాయనో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఆధారాలతో సహా స్పష్టం చేశారు.
🚨 First time ever!
Sakshi News X Space is live 🔊
Have doubts on the Land Re-survey done by YS Jagan Garu’s government?
Join,
listen, and ask your questions directly.@sakshinews https://t.co/yMrGWpW687— Nagarjuna Yadav (@ImYanamala) January 24, 2026


