వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్‌కు నోటీసులు | Police Issue Notices to YSRCP Leader Nagarjuna Yadav | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్‌కు నోటీసులు

May 5 2026 8:40 PM | Updated on May 6 2026 1:39 PM

Police Issue Notices to YSRCP Leader Nagarjuna Yadav

సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నినందుకుగాను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.  కేంద్ర ప్రభుత్వం పంపిన రూ. 1,120 కోట్లను ‘ఏమైంది’  అని అడిగినందుకు నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు చేశారు కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీసులు. డిసెంబర్ 16, 2024 నుండి సెప్టెంబర్ 10, 2025 వరకు 244 రోజుల పాటు స్థానిక సంస్థలకు వచ్చిన నిధులను విడుదల చేయకుండా, ఆ డబ్బులను ఏమి చేశారు?అని ప్రశ్నించారు. 

నిధులు దారి మళ్లించారా?, అలా అయితే, ఏ శాఖకు ఎంత మళ్లించారు?, ఎప్పుడు మళ్లించారు?, ఏ అవసరాలకు మళ్లించారో చెప్పలేరా?, ఎందుకు చెప్పడం లేదు?’ అని సాక్షి KSR లైవ్ షోలో నిలదీశారు.  దీనిపై కేసు పెట్టి, 7 రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని అబ్బూరులో నాగార్జున యాదవ్ నివాసానికి వచ్చి.. ఆయనకు నోటీసులిచ్చారు తిమ్మాపురం పోలీసులు.

వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్‌కు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement