breaking news
Kumari Aunty
-
సోషల్ మీడియా క్రేజ్.. ఏకంగా మూవీ ప్రమోషన్లలో కుమారి ఆంటీ!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అలాంటి వారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ, కుర్చీ తాత, మోనాలిసా ఇలా ఎందరో ఉన్నారు. హైదరాబాద్‌లో రోడ్డు పక్కన్ భోజనాలు విక్రయించే కుమారి ఆంటీ ఓకే ఒక్క మాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.అదే ఫేమ్‌తో ఇప్పుడు ఏకంగా మూవీ ప్రమోషన్లలో భాగమయ్యారు కుమారి ఆంటీ. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా షో టైమ్ ప్రమోషన్లలో సందడి చేశారు. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్‌తో ఆమె ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ప్రమోషన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
కైసే హే ఆప్..
కుమారి ఆంటీ.. కైసే హే ఆప్ అంటూ ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సర్ప్రైజ్ చేశారు. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్‌కు పేరుగాంచిన కుమారీ ఆంటీ గురించి అందరికీ తెలిసిందే. కుమారి ఆంటీ హోటల్‌ను సోనూ సూద్ శుక్రవారం సందర్శించి, ఆమెతో ముచ్చటించారు. అంతేకాకుండా స్వయం కృషితో ఎదిగి, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారన్నారు. కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు ఆదర్శనీయమని అన్నారు. హోటల్లో ఎలాంటి వంటకాలు అందుబాటులో ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. రూ.80కి వెజ్, రూ.120కి నాన్ వెజ్ లభిస్తాయని తెలిపారు. తను శాకాహారినని, తనకైతే వెజ్మీల్ ఎంతకు అమ్ముతావని సోనూ అడిగారు. దీనికి సమాధానంగా...ఎంతో మందికి సహాయం చేసిన మీకు ఏదైనా ఉచితంగానే ఇస్తానని తన అభిమానాన్ని చాటుకున్నారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు సోనూ సూద్ స్వయంగా ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తోడా, తోడా హిందీ మాత్రమే వస్తుందని కుమారి ఆంటీ తెలుపగా.. ‘మీ హిందీ చాలా బాగుంది’ అని సరదాగా కితాబిచ్చారు. అనంతరం ఆమె పిల్లల గురించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ కాసేపు సందడి చేశారు. సోనూ సూద్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చారు. ఏదేమైనా..పట్టుదల, కృషితో ముందుకొచ్చే వారిని గుర్తించడం, ప్రోత్సాహమందించడంలో సోనూ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నారు. అయితే కుమారి ఆంటీని కలిసిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. -
డిస్కౌంట్ ఎంత ఆంటీ ?.. కుమారి ఆంటీతో సోను సూద్
-
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్
-
కుమారి ఆంటీని సన్మానించిన సోనూ సూద్ (ఫోటోలు)
-
కుమారి ఆంటీ క్రేజ్.. ఏకంగా ఆ కొత్త సినిమా ట్రైలర్లోనూ
సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో తెలీదు. అలా ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీ బాగా క్రేజీ సంపాదించింది. హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఈమె అనుకోకుండా సెలబ్రిటీ అయిపోయింది. పలు టీవీ షోల్లోనూ కనిపించింది. ఇప్పుడు ఈమె క్రేజ్ సినిమాల వరకు కూడా పాకేసింది. (ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) గత నెలలో మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మూవీని ఇప్పుడు తెలుగులోనూ మార్చి 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రం ఉండబోతుందని అర్థమైంది. అయితే ట్రైలర్లోనే హైదరాబాద్ ఫేమస్ కుమారి ఆంటీ రిఫరెన్స్ ఉపయోగించేశారు. 'ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ, పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు' అనే డైలాగ్ ఫన్నీగా అనిపించింది. అలానే 'ఆర్ఆర్ఆర్'లో బాగా ఫేమస్ అయిన 'తొక్కుకుంటూ పోవాలే' అనే డైలాగ్ కూడా ఈ ట్రైలర్లో చూపించి నవ్వు తెప్పించారు. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ తెలుగులో ఏం చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్) -
కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కుమారి ఆంటీ.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. హైరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆమె మాటలతో రీల్స్ కూడా క్రియెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో ఓ ట్వీట్ చేశారు. దీనిని చూస్తుంటే కుమారీ ఆంటీని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అసలేం పోస్టు చేశారంటే.. ‘ మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా’ అంటూ బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు..ట్రాఫిక్ నియమాలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024 ఇది చూసిన నెటిజన్లు.. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎమోజీలు, కుమారి ఆంటీ డైలాగ్ వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదొక్కడే కాదు సమయం, సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్స్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు. చదవండి: ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన -
కుమారి ఆంటీ క్రేజ్.. షోలు చేయడం మొదలుపెట్టేసిందిగా..!