కుమారి ఆంటీ క్రేజ్.. ఏకంగా ఆ కొత్త సినిమా ట్రైలర్‌లోనూ | Kumari Aunty Dialogue In Premalu 2024 Telugu Movie Trailer, Check Trailer Highlights Inside - Sakshi
Sakshi News home page

Premalu Trailer: మలయాళంలో హిట్.. తెలుగులో మూవీ రిలీజ్ ఫిక్స్

Mar 2 2024 9:55 PM | Updated on Mar 3 2024 1:42 PM

Premalu Movie Trailer Telugu Kumari Aunty Dialogue - Sakshi

సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో తెలీదు. అలా ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీ బాగా క్రేజీ సంపాదించింది. హైదరాబాద్‍‌లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఈమె అనుకోకుండా సెలబ్రిటీ అయిపోయింది. పలు టీవీ షోల్లోనూ కనిపించింది. ఇప్పుడు ఈమె క్రేజ్ సినిమాల వరకు కూడా పాకేసింది.

(ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్)

గత నెలలో మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మూవీని ఇప్పుడు తెలుగులోనూ మార్చి 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రం ఉండబోతుందని అర్థమైంది.

అయితే ట్రైలర్‌లోనే హైదరాబాద్ ఫేమస్ కుమారి ఆంటీ రిఫరెన్స్ ఉపయోగించేశారు. 'ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ, పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు' అనే డైలాగ్ ఫన్నీగా అనిపించింది. అలానే 'ఆర్ఆర్ఆర్'లో బాగా ఫేమస్ అయిన 'తొక్కుకుంటూ పోవాలే' అనే డైలాగ్ కూడా ఈ ట్రైలర్‌లో చూపించి నవ్వు తెప్పించారు. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ తెలుగులో ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement