పుష్ప అంటే ఇంటర్నేషనల్‌.. జపాన్‌లో 'అల్లు అర్జున్‌' ఎంట్రీ | Allu Arjun Enters Japan With Family For Pushpa 2 Movie Release | Sakshi
Sakshi News home page

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌.. జపాన్‌లో 'అల్లు అర్జున్‌' ఎంట్రీ

Jan 13 2026 1:23 PM | Updated on Jan 13 2026 1:32 PM

Allu Arjun Enters Japan With Family For Pushpa 2 Movie Release

అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు జపాన్‌లో అడుగుపెట్టారు. తను నటించిన పుష్ప-2 చిత్రం జనవరి 16న 'పుష్ప కున్రిన్‌' పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించారు.  ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు జపాన్‌లో ఏంతమేరకు మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

‘పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’ అంటూ అల్లు అర్జున్‌ కొట్టిన డైలాగ్‌కు ఇప్పుడు కెరెక్ట్‌గా సెట్‌ అయిందని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు. పుష్ప-2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ.. గీక్‌ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్‌లో విడుదల చేస్తుంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ టోక్యో చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. సినిమాలో జపాన్‌ నేపథ్యం కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జపాన్‌ ప్రజలకు ఎర్రచందనం వుడ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి పుష్ప కలెక్షన్స్‌ పెరగవచ్చని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement