‘ఆమెతో నా భార్యకు వివాహేతర సంబంధం’ | Ashleigh Gardner Partner Alleges Cheating Blame On Australian Teammate | Sakshi
Sakshi News home page

‘ఆమెతో నా భార్యకు సంబంధం.. నన్ను మోసం చేసింది’

Jul 13 2026 12:09 PM | Updated on Jul 13 2026 12:22 PM

Ashleigh Gardner Partner Alleges Cheating Blame On Australian Teammate

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌, మహిళా జట్టు వైస్‌ కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆష్లేకు సహచర క్రికెటర్‌తో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె భాగస్వామి మోనికా రైట్‌ ఆరోపించింది. కాగా ఆష్లే గార్డ్‌నర్‌- మోనికా రైట్‌ 2020లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమ్యారు.

పెళ్లైన కొన్ని నెలలకే
దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ అమ్మాయిలు.. 2025, ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా ఆష్లే- మోనికా వివాహ వేడుక జరిగింది. అయితే, పెళ్లైన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు వచ్చాయని.. అప్పటి నుంచి వీరు విడివిడిగా ఉంటున్నారని డెయిలీ మెయిల్‌ కథనం ప్రచురించింది.

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 సందర్భంగా ఆష్లేను చూడటానికి మెనికా ఇండియాకు రాగా.. ఆష్లే ఆమెతో సరిగ్గా మాట్లాడలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే తన వెడ్డింగ్‌ రింగ్‌ను కూడా ఆష్లే పక్కనపెట్టిందని వేరేవారి ద్వారా మెనికాకు తెలిసిందని సదరు కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోనికా రైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది.

నా భార్యకు ఈమెతోనే సంబంధం ఉంది
డెయిలీ మెయిల్‌ కథనాన్ని అసంబద్ధమైనదిగా పేర్కొంటూనే.. షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. ఆసీస్‌ యువ ఓపెనర్‌ జార్జియా వోల్‌ ఫొటోను షేర్‌ చేసిన మోనికా.. ‘‘నా భార్యకు ఈమెతోనే సంబంధం ఉంది. ఈమె కోసమే నన్ను మోసం చేసింది’’ అని పేర్కొంది. కాగా ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

రికార్డు స్థాయిలో ఏకంగా ఏడోసారి కంగారూ జట్టు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ఆష్లే గార్డ్‌నర్‌ది కీలక పాత్ర. ఇక ఈ టోర్నీతోనే తొలిసారి ప్రపంచకప్‌ ఆడిన జార్జియా వోల్‌ సైతం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ ఆష్లే పార్ట్‌నర్‌ మోనికా ఆరోపించడం వైరల్‌గా మారింది. కాగా పెళ్లైన కొన్నాళ్ల తర్వాత పిల్లల విషయంలో నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఆష్లే- మోనికా మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక మోనికా ఆరోపణలపై ఇటు ఆష్లే గానీ.. అటుక్రికెట్‌ ఆస్ట్రేలియా గానీ స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement