'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన! | What Happens Next-After-60-Fans Get FIFA WC-2026 Tickets-Free | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: 'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!

Jun 6 2026 6:38 PM | Updated on Jun 6 2026 7:52 PM

What Happens Next-After-60-Fans Get FIFA WC-2026 Tickets-Free

మ‌రో వారం రోజుల్లో ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెర‌లేవ‌నుంది. జూన్ 11 నుంచి జూలై 19 వ‌రకు కొన‌సాగ‌నున్న టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ల‌కు సంబంధించి చాలా టికెట్లు ఇప్ప‌టికే అమ్ముడ‌య్యాయి. అయితే వెబ్‌సైట్ పొర‌పాటు వ‌ల్ల చిన్న త‌ప్పిదం జ‌రిగిపోయింది. వెబ్‌సైట్‌లో త‌ప్పిదం కార‌ణంగా సుమారు 60 మంది అభిమానులు ఉచితంగా టికెట్లు పొందారు. 

అయితే వీటికి అభిమానులు ఒక్క రూపాయి కూడా చెల్లించ‌క‌పోవ‌డంతో ఫిఫా నిర్వాహ‌కులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. వెబ్‌సైట్ లోపం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన ఫిఫా ఆ 60 టికెట్ల‌ను వెన‌క్కి ఇచ్చేయాల‌ని, వాటి స్థానంలో కొత్త టికెట్లు జారీ చేస్తామ‌ని అభిమానుల‌ను అభ్య‌ర్థించింది. ఉచితంగా వ‌స్తే వ‌దల‌కూడద‌న్న సామెత‌ను ఒంట‌బ‌ట్టించుకున్న అభిమానులు ఫిఫా అభ్య‌ర్థ‌న‌ను ప‌ట్టించుకోలేదు. 

దీంతో ఫిఫా ఉన్న‌ప‌ళంగా ఆ టికెట్ల‌ను ర‌ద్దు చేసింది. అయితే త‌మ త‌ప్పిదం వ‌ల్లే ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌డంతో అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని ఫిఫా తెలిపింది. అయితే టికెట్లు ర‌ద్దు చేయాల‌ని ముందు నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ ఫ్యాన్స్ స్పందించ‌డంతో త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. అయితే త‌మ‌కు వ‌చ్చిన టికెట్ల‌కు ఉన్న ధ‌ర మొత్తాన్ని చెల్లిస్తే హ్యాపీగా మ్యాచ్ చూసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

అయితే ప్ర‌పంచ‌క‌ప్‌ మ్యాచ్‌ల‌కు సంబంధించి టికెట్ల‌న్నీ అమ్ముడ‌య్యాయంటూ ఫిఫా అధ్య‌క్షుడు గియానీ ఇన్ఫాంటినో మూడు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక జూన్ 11 నుంచి జ‌ర‌గ‌నున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, కెన‌డా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా డిపెండింగ్ చాంపియ‌న్ హోదాతో బ‌రిలోకి దిగ‌నుంది.

చదవండి: బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెట‌ర్‌.. భార‌త‌ జ‌ట్టులోకి స్వాగ‌తం!

Advertisement
 
Advertisement
Advertisement