శతక్కొట్టిన జార్జియా వోల్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | Georgia Voll Century AUS-W Won 3rd T20I Cleansweep T20 Series | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన జార్జియా వోల్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Mar 24 2026 11:39 AM | Updated on Mar 24 2026 11:58 AM

Georgia Voll Century AUS-W Won 3rd T20I Cleansweep T20 Series

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగ‌ళ‌వారం కింగ్స్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 40 ప‌రుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజ‌యం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 211 ప‌రుగులు చేసింది. జార్జియా వోల్ (53 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) శ‌త‌కంతో మెరిసింది. చివ‌ర్లో నికోలా కేరీ (24 నాటౌట్‌), సోఫీ మొలినెక్స్ (25) రాణించారు. అయితే ఆసీస్ చేసిన స్కోరులో స‌గం ప‌రుగులు జార్జియావే ఉండ‌డం విశేషం. కాగా జార్జియా వోల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం.

వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీయ‌గా, జాజ్రా క్లాక్స్‌ట‌న్ 2 వికెట్లు ప‌డ‌గొట్టింది. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే స‌మయానికి 10 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (30 నాటౌట్‌), డియాండ్రా దొతిన్ (11 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఎలీస్‌పెర్రీ, మేగ‌న్ స్కాట్‌,లూసీ హామిల్ట‌న్ త‌లా ఒక వికెట్ తీశారు.  

అయితే వ‌ర్షం ఎంత‌కీ త‌గ్గ‌క‌పోవ‌డంతో పిచ్‌ను ప‌రిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసి డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఆస్ట్రేలియాను విజేత‌గా ప్ర‌క‌టించారు. సెంచ‌రీతో విధ్వంసం సృష్టించిన జార్జియా వోల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా, అలానా కింగ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది.

చదవండి: IPL 2026: ‘పరాగ్‌కు అంత సీన్‌ లేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement