CSK Vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా | IPL 2024 CSK Vs MI: Rohit Sharma Becomes First Indian Batter To Hit 500 Sixes In T20 Cricket, See Details Inside - Sakshi
Sakshi News home page

#Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా

Apr 14 2024 11:13 PM | Updated on Apr 15 2024 11:43 AM

Rohit Sharma hits 500 sixes in T20 cricket - Sakshi

టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 500 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, కీరన్ పొలార్డ్ (860), ఆండ్రీ రస్సెల్ (678), కొలిన్ మున్రో (548) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌(597) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement