టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అబ్డోమినల్ సర్జరీ తర్వాత తిలక్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు.
అయితే శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్‌లో తిలక్ పాల్గోనున్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్.. ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా తొలుత న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకుండా అతడి ఆడించి రిస్స్ తీసుకోడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే తిలక్ స్ధానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను ఆఖరి రెండు టీ20లకూ కొనసాగించారు. తిలక్ తిరిగి రీఎంట్రీ ఇస్తే జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది.
మయాంక్ ఫిట్..
మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్‌లలో ఇండియా-ఎ తరపున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడి భుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ యో-యో టెస్టు పాస్ అయ్యాడు.
అతడు కూడా తిలక్‌తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్‌లో భాగం కానున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లకు వాషీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చదవండి: వరల్డ్‌కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్


