అల్కరాజ్ అదరహో.. ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ సంచలనం | Alcaraz Overcomes Injury To Enter Aus Open Final, Stuns Zverev In Thriller | Sakshi
Sakshi News home page

Australian Open 2026: అల్కరాజ్ అదరహో.. ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ సంచలనం

Jan 30 2026 3:25 PM | Updated on Jan 30 2026 3:34 PM

Alcaraz Overcomes Injury To Enter Aus Open Final, Stuns Zverev In Thriller

ఆస్ట్రేలియన్ ఓపెన్-2026లో స్పెయిన్‌ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. అల్కరాజ్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. హోరాహోరీ సాగిన ఈ పోరులో  6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు.

మొదటి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికి..  జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్‌ను నిర్వహించారు.

అల్కరాజ్ అద్బుత పోరాటం..
అయితే ఈ మ్యాచ్ మూడో సెట్‌లో అల్కరాజ్ కుడి కాలికి గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలగడతాడని అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు.

మెడికల్ టైమ్ అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో 3-5తో అల్కరాజ్‌ వెనుకబడినప్పటికీ.. తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్‌.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్‌లతో తలపడే అవకాశముంది. సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్‌లు అమీతుమీ తెల్చుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement