అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. దాదాపు ఏడాది పాటు భారత తరపున పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్.. ఈ ఏడాది ఆసియాకప్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అప్పటివరకు ఓపెనర్‌గా కొనసాగుతున్న సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌కు టీమ్‌మెనెజ్‌మెంట్ డిమోట్ చేసింది.
అయితే తన టీ20 పునరాగమనంలో గిల్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. గురువారం క్వీన్స్‌లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టీ20లో గిల్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికి.. అతడి జిడ్డు బ్యాటింగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది.
ఈ మ్యాచ్‌లో గిల్ 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతడు 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. తొలుత గిల్ పవర్‌ప్లేలో అభిషేక్ శర్మతో కలిసి కాస్త దూకుడా ఆడాడు. కానీ అభిషేక్ ఔటయ్యాక గిల్ బ్యాటింగ్ జోరు తగ్గింది. తను ఎదుర్కొన్న చివరి 21 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో గిల్ టీ20లకు సరిపోడని.. అతడికి బదులుగా జైశ్వాల్, సంజూ శాంసన్ ఎంతో బెటర్ అని నెటిజన్లు ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు.
గిల్ గణాంకాలు ఇవే..
2023లో టీ20 అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 32 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 808 పరుగులు మాత్రమే చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 28.86 ఉండగా, స్ట్రయిక్‌రేట్ 139.32గా ఉంది. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
అయితే ఇదే ఫార్మాట్‌లో మరో ఓపెనర్ జైశ్వాల్ 22 ఇన్నింగ్స్‌లలో 36.15 యావరేజ్, 164.31 స్ట్రయిక్‌రేట్‌తో 723 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ సైతం ఓపెనర్‌గా వచ్చి అద్భుతాలు చేశాడు. ఓపెనర్‌గా కేవలం 13 ఇన్నింగ్స్‌లే ఆడినా సెంచరీలు మోత మ్రోగించాడు.
34.75 యావరేజ్, 182.89 స్ట్రయిక్‌రేట్‌తో 417 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనర్‌గా సత్తాచాటాడు. 9 మ్యాచ్‌లలో భారత్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన గైక్వాడ్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 365 పరుగులు చేశాడు. అందరికంటే రుతురాజ్( 60.83) సగటే ఎక్కువగా ఉంది. టీమిండియా మిగతా ఓపెనర్లతో గిల్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఒకవేళ ఇదే తీరును శుభ్‌మన్ కొనసాగిస్తే టీ20 జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశముంది.
చదవండి:


