
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. మొత్తంగా 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 నిమిషాలకు ఆరంభం కావాల్సింది. అయితే, తాజాగా మ్యాచ్ ఆరంభ సమయంలో మార్పులు చేస్తున్నట్లు యూఏఈ క్రికెట్ ప్రకటించింది.
ఫైనల్‌తో సహా..
ఆసియా కప్-2025 టోర్నీలో 19 మ్యాచ్‌లకు గానూ.. 18 మ్యాచ్‌లు (ఫైనల్‌తో సహా) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. సెప్టెంబరులో యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు యూఏఈ క్రికెట్ ఈ మేరకు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కాగా సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ- ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్‌లో మాత్రం మార్పులేదు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీకి తెరలేవనుంది. సెప్టెంబరు 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
లీగ్ దశ షెడ్యూల్
👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు
👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
సూపర్ 4 దశ
👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.
చదవండి: రాజస్తాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్‌బై.. అధికారిక ప్రకటన విడుదల