
సెయింట్స్ కిట్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో కంగారులు వైట్‌వాష్ చేశారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 19.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మైర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లీస్ రెండు వికెట్లు సాధించారు.
ఆ తర్వాత 171 లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలోనే చేధించింది. ఆసీస్ ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ ఓవన్ మరోసారి బ్యాట్, బంతితో మ్యాజిక్ చేశారు. ఈ విజయంతో ఆసీస్ జట్టు పలు అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకుంది.
ఆసీస్ వరల్డ్ రికార్డు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టెస్టు హోదా కలిగిన జట్టును 5-0 తేడాతో వైట్‌వాష్ చేసిన టీమ్‌గా ఆస్ట్రేలిచా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేసింది.
అదేవిధంగా ఒక విదేశీ టూర్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. విండీస్ పర్యటనలో ఆసీస్ మూడు టెస్టుల, ఐదు టీ20లు కలిపి మొత్తం 8 మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టును ఓడించింది. ఈ జాబితాలో భారత జట్టు అగ్రస్ధానంలో ఉంది. 2017లో శ్రీలంక పర్యటనలో టీమిండియా వరుసగా 9 విజయాలు సాధించింది.
చదవండి: గిల్‌పై విమర్శలు.. గంభీర్ కౌంటర్!.. పంత్‌ను ఎంత పొగిడినా తక్కువే!