చరిత్ర సృష్టించిన ధోని.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా | MS Dhoni Creates History; Becomes First Player In The World | Sakshi
Sakshi News home page

#MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Apr 1 2024 12:10 AM | Updated on Apr 1 2024 10:49 AM

MS Dhoni Creates History; Becomes First Player In The World - Sakshi

PC: IPL.com

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీఎస్‌కే స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 300 వికెట్లలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.  

ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. ఈ జాబితాలో ధోనీ(300) అగ్రస్థానంలో ఉండగా.. కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఢిల్లీ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే ఓటమిపాలైనప్పటికి.. ఎంఎస్‌ ధోని మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్‌ కూల్‌.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

Advertisement
 
Advertisement
Advertisement